ఐపీఎల్‌కు చైనా బ్రాండ్ అవసరం లేదు: హర్భజన్ సింగ్

ఐపీఎల్‌కు చైనా బ్రాండ్ అవసరం లేదు: హర్భజన్ సింగ్

లడఖ్ యొక్క గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. అయితే అప్పటి నుండి ''బాయికాట్ చైనా'' అనే నినాదం భారత్ లో మారుమోగుతోంది. చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ కు ''వివో'' అనే ఒక చైనా ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తుంది. అందువల్ల ఆ స్పాన్సర్షిప్ ను తొలగించాలంటూ ప్రజలు బీసీసీఐ ని కోరారు. అయితే వివో స్పాన్సర్షిప్ వలన మనకే లాభం కలుగుతుంది అందువల్ల దానిని తొలగించడం కుదరదు అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్ తెలిపాడు. అయితే ఈ విషయం పై స్పందించిన ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. భారత సైనికులపై దాడి చేస్తున్న దేశం భారత డబ్బుతో లాభం పొందకూడదు, అందువల్ల చైనా వస్తువులను నిషేధించాలని చెప్పే వారందరితో నేను ఉన్నాను అని హర్భజన్ పేర్కొన్నాడు. అలాగే ఐపీఎల్ వివాదం పై మాట్లాడుతూ... ''ఐపీఎల్ ప్రమోషన్లకు అసలు బ్రాండ్ అవసరం లేదని, అది ఒక కూడా చైనా బ్రాండ్'' అని హర్భజన్ అన్నారు. అయితే చూడాలి మరి ఈ విషయంపై బీసీసీఐ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.