హ్యాపీ బర్త్ డే స్నేహ 

హ్యాపీ బర్త్ డే స్నేహ 

సినిమా అంటేనే గ్లామర్ రంగం.. స్కిన్ షోలు తప్పనిసరి.. స్కిన్ షోలకు దూరంగా ఉంటూ మంచి సినిమాలు చేసి మెప్పించిన నటీమణులు కూడా ఉన్నారు.  పూర్వం సావిత్రి, సౌందర్యలు ఎలాగైతే మెప్పించారు.. ఆ తరువాత వచ్చిన స్నేహ కూడా అలానే మెప్పించింది.  ముంబైలో పుట్టి దుబాయ్ లో పెరిగి 2000 సంవత్సరంలో మలయాళంలో ఓరు నీల పక్షి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తరువాత 2001లో ప్రశాంత్ సినిమా చేసింది. ప్రశాంత్ చేసిన సినిమా పర్వాలేదనిపించింది.  

ఈ సినిమా తరువాత స్నేహకు తెలుగులో తొలివలపు సినిమాతో అవకాశం వచ్చింది.  ఆ సినిమా మంచి విజయం దక్కించుకుంది.  స్నేహ నటనకు మంచి మార్కులు పడ్డాయి.  ఆ తరువాత వరసగా ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారథి, మధుమాసం, సంక్రాంతి, వెంకీ, పాండురంగ వంటి సినిమాలు చేసింది.  పాండురంగ సినిమా తరువాత వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.  ఓ బిడ్డకు తల్లైన తరువాత స్నేహ మరలా తెలుగులో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.  కాగా, ఇప్పుడు స్నేహ రెండో బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నది.  దీంతో స్నేహ మరలా సినిమాలకు దూరంగా ఉన్నది.  తన నటనతో మెప్పించిన స్నేహ పుట్టిన రోజు ఈరోజు.  ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం.