హ్యాపీ బర్త్ డే సమీరా రెడ్డి 

హ్యాపీ బర్త్ డే సమీరా రెడ్డి 

సమీరా రెడ్డి... ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.  ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అందులో జై చిరంజీవ సినిమా మినహా ఏ సినిమా హిట్ కాలేదు.  అయితే, హిందీ, తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకుంది.  బాలీవుడ్ లో 2002లోనే ఎంట్రీ ఇచ్చింది.  2002 నుంచి 2013 వరకు సినిమాలు చేసిన సమీరా ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది.  

పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది.  అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన సమీరా రెడ్డి సొంత ఊరు రాజమండ్రి.  అయితే, తండ్రి బిజినెస్ మెన్ కావడంతో ముంబైలో పుట్టిపెరిగింది.  సమీరా రెడ్డి గ్రాడ్యుయేషన్ చేసే సమయంలోనే మ్యూజిక్ ఆల్బమ్ చేసేందుకు అవకాశం వచ్చింది.  1996లో మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది.  ఆ తరువాత కొన్నాళ్ళు కెమెరాకు దూరంగా ఉంది.  2002లో మైనే దిల్ తుజుకో దియా అంటూ ఎంట్రీ ఇచ్చింది.  కాగా, నేడు సమీరా రెడ్డి పుట్టినరోజు.  నటిగా ఎన్నో సక్సెస్ లు అందుకున్న సమీరా.. మరెన్నో హిట్స్ సాధించాలని కోరుకుందాం.