హ్యాపీ బర్త్ డే రాజమౌళి   

హ్యాపీ బర్త్ డే రాజమౌళి   

సినిమా ఇండస్ట్రీ అన్న తరువాత విజయాలు ఉంటాయి.. ఫెయిల్యూర్స్ ఉంటాయి.  ఇండస్ట్రీలో నిలబడాలి అంటే విజయాలు ఉండాలి.  ఒకటి రెండు పరాజయాలు వచ్చినా.. విజయమే అంతిమంగా ఒక ఇండస్ట్రీలో నిలబెడుతుంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయాలే తప్పా.. పరాజయాలు ఎరుగని ధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.  

అప్పటి నుంచి ఇప్పటి వరకు వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.  ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించారు.  ప్రస్తుతం 13వ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్నది. బాహుబలి సినిమా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది.  దర్శక ధీరుడిగా నిలబెట్టింది.  దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలవడం విశేషం.  బాహుబలి సీరీస్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం.  భారీ చిత్రాలను తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న రాజమౌళి అక్టోబర్ 10, 1973 వ సంవత్సరంలో కర్ణాటకలోని రాయచూరులో జన్మించారు.  

సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబంలో జన్మించడం వలన రాజమౌళికి చిన్న తనం నుంచి సినిమా వాతావరణం అలవాటైంది.  సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రాజమౌళి టీవీ సీరియళ్లకు పనిచేశారు.  బుల్లితెరపై తనను తాను నిరూపించుకున్న తరువాత వెండితెరపైకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తున్నారు.  ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే ముల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు.  ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.