హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్

హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్

పవర్ స్టార్ కి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారనేది ఆయన అభిమానులు చెప్పుకునే మాట. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఆయన ఫాలోయింగ్ తెలిపే మాట అది. డబ్బు కాదు నాకు ప్రజలే ముఖ్యం అంటూ సినిమాలను వదిలి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టింది ఈరోజే. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, స్టార్లు వచ్చారు వస్తారు కానీ పవర్ స్టార్ కి ఉండే క్రేజే వేరు. మెగాస్టార్ తమ్ముడిగా 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత 'గోకులంలో సీత','సుస్వాగతం' వంటి సినిమాలతో తన మార్క్ వేసుకున్నారు. ఆ తరువాత తమ్ముడు, బద్రి ఇలా వరుస హిట్స్ తో ఆయన స్టామినా అమాంతం పెరిగిపోయింది.

2001లో వచ్చిన 'ఖుషి' ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. నటుడిగానే కాక 'జానీ' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఎన్నో ఫ్లాపులు చూసినా 'జల్సా'తో మరో సారి తన స్టామినా నిరూపించాడు. మళ్లీ 'పులి','తీన్ మార్','పంజా' సినిమాలతో ఫ్లాపులు వెంటాడినప్పటికీ'' మళ్ళీ 'గబ్బర్ సింగ్'తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేసిన 'జనసేన' పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావడంతో నటుడిగా పవన్ కి గ్యాప్ వచ్చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీ ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. అయినా తాను జనాన్ని విడవనంటూ జనంలోనే ఉంటున్న పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.