హ్యాపీ బర్త్ డే మీనా..!!

హ్యాపీ బర్త్ డే మీనా..!!

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. అనతికాలంలోనే మంచి నటిగా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మీనా.  అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది.  1982లో తమిళంలో వచ్చిన నెంజంగల్ సినిమాతో బాలనటిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది మీనా.  అదే ఏడాది రజినీకాంత్ సినిమాలో రజిని కూతురిగా సినిమా చేసింది.  1990లో నవయుగం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఆ తరువాత ఏడాది వచ్చిన సీతారామయ్యగారి మనమరాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

ఆ తరువాత తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో ఎన్నో సినిమాలు చేసింది.  చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మీనా పుట్టినరోజు నేడు.  మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుందాం.