హ్యాపీ బర్త్ డే మలైకా అరోరా 

హ్యాపీ బర్త్ డే మలైకా అరోరా 

బాలీవుడ్ లో ఫిట్నెస్ గురించి చెప్పాలి అంటే.. మలైకా అరోరాను చూపిస్తే సరిపోతుంది.  హెల్త్, ఫిట్నెస్ విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.  46 ఏళ్ల వయసులోనూ మలైకా అరోరా ఫిట్నెస్ తో కూడిన అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.  బాలీవుడ్లో ప్రత్యేక నృత్యాలతో ఫేమసైనా మలైకా.. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ను వివాహం చేసుకొని ఖాన్ ఇంటి కోడలైంది.  

ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు.. ఇటీవలే అర్భాజ్.. మలైకా విడిపోయారు.  దీనికి బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ అని బాలీవుడ్ కోడై కూస్తున్నది.  మలైకా.. అర్జున్ జంట ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు.  పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.  కానీ, వీటిపై ఈ ఇద్దరు స్పందించకపోవడం విశేషం.  బాలీవుడ్ స్టార్స్ పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకుంటారో చెప్పక్కర్లేదు.  స్టార్స్ ఇంట ఆ ముందురోజు రాత్రి వేడుకను నిర్వహిస్తారు.  స్టార్స్ అంతా అక్కడికి చేరుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.  మలైకా కూడా తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ కు ట్రీట్ ఇచ్చింది.  మలైకా బర్త్ డే బాష్ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ చాలామంది హాజరయ్యారు.  కరీనా కపూర్, కరిష్మా కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ లతో పాటు అనేకమంది స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు.