హ్యాపీ బర్త్ డే జ్యోతిక

హ్యాపీ బర్త్ డే జ్యోతిక

జ్యోతిక గురించి అందరికి తెలుసు.  తెలుగులో ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనదైన ముద్రను వేసుకుంది.  తెలుగు హీరోయిన్ నగ్మా చెల్లిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  నగ్మాలా మంచి పేరు తెచ్చుకుంది.  ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.  

మెగాస్టార్ తో ఠాగూర్, నాగార్జునతో మాస్ సినిమా చేసింది.  ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  తమిళంలో ఆమె ఎక్కువ సినిమాలు చేసింది.  తమిళంలో చంద్రముఖి సినిమాలో చంద్రముఖిగా ఆమె చేసిన అభినయం అందరిని మెప్పించింది.  కాగా, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న సమయంలో హీరో సూర్యను వివాహం చేసుకుంది.  కాగా, నేడు జ్యోతిక పుట్టినరోజు.  ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుందాం.