మా దగ్గర ఒలింపిక్స్ వద్దు అంటున్న టోక్యో వాసులు... 

మా దగ్గర ఒలింపిక్స్ వద్దు అంటున్న టోక్యో వాసులు... 

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించి పోయిన విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా అనేక కార్యక్రమాలు, సినిమా షూటింగ్లు, ఆటలు, సమావేశాలు, ఇలా చాలానే వాయిదాపడ్డాయి. అందులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టోక్యో ఒలంపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ నెల 23 న ప్రారంభం కావాల్సిన ఒలంపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వైరస్ ప్రభావం అప్పటివరకు కూడా తగ్గేలా కనిపించడం లేదు. దాంతో వచ్చే ఏడాది కూడా మా దగ్గర ఈ గేమ్స్ నిర్వహించవద్దు అంటున్నారు  టోక్యో ప్రజలు. తాజాగా టోక్యో లోని ఓ స్థానిక సంస్థ నిర్వహించిన సర్వేలో 51.7 శాతం మంది టోక్యో వాసులు వచ్చే ఏడాది కూడా ఒలంపిక్స్ జరపకుండా  వాయిదా వేయాలి అని తీర్పును ఇచ్చారు. ఇక ఇప్పటివరకు జపాన్ లో దాదాపు 20,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు అలాగే 976 మందిమరణించారు.