అధికారం కోసం రాజకీయ పోరాటం!

అధికారం కోసం రాజకీయ పోరాటం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం రాజకీయ పోరాటం నడుస్తోందంటూ సెటైర్లు వేశారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు... ఏపీలో అభివృద్ధిని పక్కనబెట్టి దీక్షలు, పోరాటాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని తెలిసినా... ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జీవీఎల్... కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తే... బాగుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని విమర్శలు గుప్పించారు. 

బీజేపీ - టీడీపీ పొత్తులపై స్పందించిన జీవీఎల్... తెలుగుదేశం పార్టీతో చివరి నిమిషం వరకు తాము మిత్రధర్మం పాటించామని స్పష్టం చేశారు. టీడీపీనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోందని ఆరోపించారు జీవీఎల్... కాంగ్రెస్‌కు టీడీపీ దగ్గరవుతుందని కార్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందన్నారాయన. ఇక నవ్యాంధ్ర రాజధానిలో వర్షంతో సచివాలయంలో లీకులపై స్పందించిన ఆయన... నూతనంగా నిర్మించిన సచివాలయంలో లీకులు చూసైనా మరోసారి తప్పులు దొర్లకుండా ప్రభుత్వం చూసుకోవాలని సూచించారు.