కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం..!

 కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం..!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం రేగింది. కంగనా రనౌత్  హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో తన సొంతింట్లో ఉండగా శుక్రవారం రాత్రి పదకొండున్నరకు కాల్పుల శబ్దం వినిపించింది. దాంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు కాల్పులు ఎవరు జరిపారన్నది ఇంకా తెలియలేదు. ఇక ఈ ఘటన పై కంగన స్పందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు. కానీ ఎవరి బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. కావాలనే తన ఇంటిముందు కాల్పులు జరిపారని స్పష్టం చేసారు. తన గది భయట గోడ కి అవతల  ఎవరో ఉన్నట్టు అనిపించిందని తెలిపారు.