మంత్రి కొడుక్కి మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన "లేడి సింగం".!

మంత్రి కొడుక్కి మరోసారి వార్నింగ్‌ ఇచ్చిన "లేడి సింగం".!

గుజరాత్ లో మహిళా కానిస్టేబుల్ సునీతా యాదవ్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనను ఉల్లంఘించిన మంత్రి కుమారుడు సునీతా యాదవ్ కి ఫోన్ చేసి పవర్ మా చేతిలో ఉంది మేం తలుచుకుంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాం అంటూ బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడని లేడి సింగం మీ తండ్రికి నీకు సర్వెంట్ ను కాదంటూ సమాధానం ఇచ్చింది. వారి ఫోన్ సంభాషణ భయటికి రావటంతో సునీత యాదవ్ కు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిసింది. కానీ మంత్రి చేతిలో  అధికారం ఉండటంతో ఆమెను ట్రాన్స్ ఫర్ చేసారు. దాంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని అది ఆమోదించాక ఐపీఎస్ గా తిరిగి లాఠీ పడతానని తెలిపింది. అది కుదరకపోతే లాయర్ గా లేదంటే జర్నలిస్ట్ గా స్థిరపడతానని  స్పష్టం చేసింది. తనకు మంత్రి అనుచరుల నుండి ముప్పు ఉందని కూడా తెలిపింది.