రాహుల్ ఇఫ్తార్ విందు 

రాహుల్ ఇఫ్తార్ విందు 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందుకు కాంగ్రెస్  మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. రాహుల్ ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌ను పిలిచే అవకాశం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రణబ్‌ను ఆహ్వానించకపోతే అది కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు తెలిపారు.  కాంగ్రెస్సే స్వయంగా ప్రణబ్‌ను బీజేపీ వైపు నెట్టినట్టు కూడా అవుతుందని రాహుల్ కు సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆయనకు కూడా ఆహ్వానం పంపారు.  రాహుల్ ఇస్తున్న ఇఫార్త్‌ విందుకు ప్రణబ్ హాజరుకావడం, ఆయనను రాహుల్ సాదరంగా ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రణబ్‌తో పాటు మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ,మన్మోహన్ సింగ్, అశోక్ గెహ్లాట్  తదితర ప్రముఖులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.