అగ్రిగోల్డ్‌‌ను కొంటాం.. ఎస్ఎల్ గ్రూప్

అగ్రిగోల్డ్‌‌ను కొంటాం.. ఎస్ఎల్ గ్రూప్

అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో కీలక ముందడుగు పడింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొనుగోలు చేస్తామని ఎస్ఎల్ సంస్థ ముందుకు వచ్చింది. ఇవాళ అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎస్ఎల్ గ్రూప్ కోర్టుకు తెలిపింది. ఇదే సమయంలో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 10 ఆస్తుల సమాచారంతో పాటు.. వాటి విలువను సీఐడీ న్యాయస్థానానికి అందజేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు .. సీఐడీ ఇచ్చిన 10 ఆస్తుల విలువ చెప్పాలని అగ్రిగోల్డ్‌ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది.