వరుడు మృతి... 95 మందికి పాజిటివ్ 

వరుడు మృతి... 95 మందికి పాజిటివ్ 

పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలీగంజ్ గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మే 12 వ తేదీన ఓ యువతితో వివాహం జరిగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గురుగ్రామ్ లో పనిచేస్తున్నాడు.  అయితే, పెళ్ళికి ముందే ఈ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నాయి.  అయినప్పటికీ దాని గురించి పట్టించుకోకుండా వివాహం జరిపించారు.  ఈ వివాహానికి పెద్ద ఎత్తున బంధువులు హాజరయ్యారు.  వివాహం జరిగిన తరువాత వరుడి ఆరోగ్యపరిస్థితి క్షిణించింది.  దీంతో   వరుడిని    పాట్నాలోని   ఎయిమ్స్ లో జాయిన్ చేశారు.  అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.  నిబంధనలకు విరుద్ధంగా బంధువులు హాజరయ్యి అంత్యక్రియలు నిర్వహించారు.  

వరుడు మరణించిన తరువాత జూన్ 15 వ్ తేదీన పెళ్ళికి హాజరైన కొంతమందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 15 మందికి పాజిటివ్ వచ్చింది.   పెళ్లి కుమార్తెకు మాత్రం నెగెటివ్ అని తేలింది.  మరికొంతమందికి ఇటీవలే టెస్టులు నిర్వహించారు.  ఈ టెస్టుల్లో అనేకమందికి పాజిటివ్ అని తేలింది.  దీంతో వరుడి వివాహానికి హాజరైన వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.