గ్రీన్‌కోతో ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌ డీల్‌

గ్రీన్‌కోతో ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌ డీల్‌

సింగపూర్‌కు చెందిన ఎటి క్యాపిటల్‌ గ్రూప్‌ సంస్థ ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌ను హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో ఎనర్జీ హోల్డింగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు 92.2 కోట్ల డాలర్ల (సుమారు రూ.6,200 కోట్లు)కు ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గ్రీన్‌కో తెలిపింది. ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌ కొనుగోలుతో గ్రీన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 1 గిగావాట్‌  పెరిగి 4 గిగావాట్లకు చేరుతుంది. ఆరెంజ్‌ చేరికతో సంస్థ విద్యుదుత్పత్తి సామర్థ్యం సహా రెవెన్యూ, స్థూల లాభం (ఇబిడిటా)లో వృద్ధి గణనీయంగా పెరగనుందని గ్రీన్‌కో తెలిపింది. పవన, సౌర, జల విద్యుత్‌ విభాగాల్లో గ్రీన్‌కో కార్యకలాపాలు సాగిస్తోంది. ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌కు ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. ఆరెంజ్‌ చేతిలో  పలు రాష్ట్రాల్లో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు ఉన్నాయి. సింగపూర్‌ కేంద్రంగా ఉన్న ఎటి క్యాపిటల్‌ అధినేత అరవింద్‌ టికూ.. ఆరెంజ్‌ రెన్యువబుల్స్‌ను ప్రమోట్‌ చేశారు.