బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్ర‌యం ప్రారంభం

బీఎస్ఎన్ఎల్ ఆస్తుల విక్ర‌యం ప్రారంభం

కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌)‌, మహానగర్‌ టెలిఫోన్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్  (ఎంటీఎన్ఎల్‌)కు చెందిన ఆస్తుల విక్రయం ప్రారంభమైంది.  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌... ఇప్పటికే కన్సల్టెంట్లను నియమించింది. సీబీఆర్ఐ, జేఎల్ఎల్ సంస్థలు.. బీఎస్ఎన్ఎల్‌, ఎంటీఎన్ఎల్ ఆస్తుల విక్రయాలకు కన్సల్టెంట్లుగా వ్యవహరించనున్నాయి. కరోనా మహమ్మారి వ్యాపించిన సమయంలో ఆస్తుల విక్రయం లాభదాయకమా? కాదా? అనే అంశాన్ని పరిశీలించనున్నాయి.  ఈ నెలాఖరు నాటికి ఈ సంస్థలు తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి. ఈ సంస్థల ఆస్తుల విక్రయాల ద్వారా రూ. 37,500 కోట్ల రూపాయల ఆదాయం రావొచ్చని ప్రధాని న‌రేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో అంచనా వేశారు. దీంతో వీటి విక్రయాలను టెలికం శాఖ వేగవంతం చేసింది.