నిమ్మగడ్డ పునర్నియామకంపై గవర్నర్‌ ఆదేశాల కారణమేమిటి?

నిమ్మగడ్డ పునర్నియామకంపై గవర్నర్‌ ఆదేశాల కారణమేమిటి?

తెలకపల్లి రవి 

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా తనను పునర్నియమించాలనికోరుతూ మాజీ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌ చేసిన విజ్ఞప్తిని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను మన్నించారు. హైకోర్టు కేసు 8136/2020 ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించినట్టు గవర్నర్‌ కార్యదర్శి నిమ్మగడ్డకు తెలియజేశారు. అయితే అందుకు తగు చర్చలు తీసుకోవల్సింది జగన్‌ ప్రభుత్వమే. నిమ్మగడ్డరెమేష్‌ గవర్నర్‌ను కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులే అసాధారణమైనవి. ఆయనహైకోర్టు సూచన మేరకు కేవలం విజ్ఞప్తి చేయడానికే కలిశారు.సూచన, విజ్ఞప్తి ఈ రెండు పదాల అర్థం అందరికీ తెలుసు. రాజ్యాంగం 361వ అధికరణం ప్రకారం గవర్నర్‌ను ఏ విధంగానూ ఆదేశించే , ఆక్షేపించే అధికారం కోర్టులకు వుండదు. ఇదివరలో నిమ్మగడ్డ చేసినపొరబాటును సరిదిద్దుకోవడానికి హైకోర్టు కల్పించిన ఒక అవకాశం,ఒకలీగల్‌ అవసరం ఇది.ౖ గతంలోవిడుదల చేసిన ఆర్డినెన్సునూ తర్వాత నిమ్మగడ్డ రమేష్‌ స్థానంలో జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని కొట్టి వేసిన హైకోర్టు తిరిగి ఆయననేనియమించడానికి చర్యలు తీసుకోవాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్మగడ్డ మాత్రం తనకు తానే తిరిగి పదవిలోకి వచ్చినట్టు ప్రకటించుకుని అభాసుపాలైనారు. తర్వాత కొన్నాళ్లకు గవర్నర్‌కు లేఖ రాసినా సహజంగానే స్పందన రాలేదు. ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుల స్టే కోసంప్రయత్నించి విఫలమైనప్పటికీ కేసు విచారణకు స్వీకరించడంతో సమస్య అక్కడ ఆగిపోయింది.ఈ దశలో నిమ్మగడ్డ రమేష్‌ హైదరాబాద్‌ హోటల్‌లో రాజకీయ నాయకులను కలవడం మరో దుమారానికి దారితీసింది.ఇవన్నీ ఆయన నైతిక బలానికి విఘాతంగా మారాయనడం నిర్వివాదాంశం. ఇప్పుడు కూడా నిమ్మగడ్డ కోర్టు ధిక్కారం కింద ఆశ్రయించారే గానినేరుగా తన నియామకం కోసంకాదు.హైకోర్టు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాజరగాల్సినపునర్నియామకం తనే ప్రకటించుకోవడంతో దారితప్పింది.అందుకే ఇప్పుడు ఆయన దిద్దుబాటు కోసం గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాక పరిణామాలను రికార్డు చేయాలని కోర్టు భావించిందనేది స్పష్టం. మా తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వనప్పుడు ప్రభుత్వం అమలు చేయాలి కదా అనేది హైకోర్టు ప్రశ్న.

గవర్నర్‌ కూడా ఆ కారణం వల్లనే వేగంగా స్పందించారు.అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్‌ చెబుతున్నట్టు కోర్టు ధిక్కారం అవుతుందా అన్నది విచారణ చేయవలసిన విషయం. కనుకనే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్‌ కోసం వారం గడువు ఇచ్చింది.ఈ లోగా ప్రభుత్వం సుప్రీం విచారణ జరుపుతుందగా ధిక్కార పిటిషన్‌పై విచారణే చెల్లదని అక్కడ మరో పిటిషన్‌ వేసింది.ఇదే దాని కౌంటర్‌ అనుకోవాలి. ఈ లోగానే గవర్నర్‌ ఉత్తర్వులువెలువడ్డాయి. వీటిని శిరసావహించాల్సిన అగత్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు గానిసుప్ర్రీంలోనూ ఇందుకు భిన్నంగాతీర్పు వచ్చే అవకాశం కనిపించదు. గతంలో కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం వంటి విషయాల్లో హైకోర్టు తీర్పునే సుప్రీం కూడా నిర్ధారించింది. తెలంగాణ సెక్రటేరియన్‌ కూల్చివేత విషయంలోనూ ఇలాటి పరిణామాలు చూశాం. మరిప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది. ప్రశ్న. ప్రభుత్వం గవర్నర్‌ ఆదేశాన్ని ఒక అవకాశంగా తీసుకుని నిమ్మగడ్డను మళ్లీ నియమించే తతంగం పూర్తి చేసే నాలుగుమాసాలుగా సాగుతున్న వ్యర్థ వివాదం ముగుస్తుంది. ఈ విషయంలో సర్కారు,నిమ్మగడ్డ కూడా తమ తమ పాఠాలు నేర్చుకోవచ్చు.్త ఎస్‌ఇసి నియామకంలో ఇమిడివున్న రాజ్యాంగ అంశాలను సుప్రీం తేల్చి చెప్పవలసి వుంటుంది.