ఇది గమనించారా? గ్యాస్ రాయితీకి కోత పెట్టేశారు..!

ఇది గమనించారా? గ్యాస్ రాయితీకి కోత పెట్టేశారు..!

లాక్‌డౌన్‌ సమయంలో అంతా ఇళ్లకే పరిమితం కావడంతో... అనూహ్యంగా పెట్రో ఉత్పత్తుల వాడకం తగ్గిపోయింది.. దీంతో.. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అమాంతం పడిపోయాయి.. ఇక, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా.. పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను నిర్ణయిస్తూ వస్తుంటాయి చమురు సంస్థలు.. పెట్రో ధరలను రోజువారీ పద్ధతిలో సమీక్షిస్తుండగా.. వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలు మాత్రం నెలకొకసారి సమీక్షించి... ప్రతీ నెల 1వ తేదీన నిర్ణయిస్తారు. ఇక, ఈ మధ్యే వంగట గ్యాస్ ధర భారీగా తగ్గింది.. మే నెలలో 14.2 కిలోల సిలిండరు ధరను చమురు సంస్థలు రూ.589.50గా నిర్ణయించడంతో.. ఏప్రిల్‌లో ఉన్న రూ.796.50గా ఉన్న గ్యాస్ ధర మేలో ఏకంగా రూ.207 తగ్గింది. ఇక, వంట గ్యాస్‌ సిలిండరు పంపిణీపై వినియోగదారులకు రాయితీ అందిస్తూ వస్తున్న కేంద్రం.. గ్యాస్ బుకింగ్.. డెలివరీ తర్వాత నగదు బదిలీ రూపంలో వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ వస్తుంది. కానీ, మే నెలలో రాయితీ సొమ్ము నిలిపివేశారు.. వంటగ్యాస్‌ సిలిండర్ల వినియోగదారుల ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ చేయకుండా మొండి చేయి చూపింది కేంద్రం.. సిలిండర్‌ ధర గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదని చెబుతున్నారు.. మళ్లీ గ్యాస్ రాయితీ ఇస్తారా? ఇంతటితే ముగిసినట్టేనా? అనే చర్చ కూడా ఆసక్తిగా సాగుతోంది.