వనిత టీవీ, యాజమాన్యం మీద గవర్నర్ ప్రశంసల వర్షం

వనిత టీవీ, యాజమాన్యం మీద గవర్నర్ ప్రశంసల వర్షం

రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్-RTPL డైరక్టర్ రమాదేవిపై గవర్నర్ తమిళిసై, సీపీ అంజనీ కుమార్ ప్రశంసలు కురిపించారు. మహిళల కోసం మహిళలే నడుపుతున్న ఏకైక ఛానల్ వనిత టీవి అని కొనియాడారు. హైదరాబాద్‌ కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో నగర పోలీస్‌ శాఖ, షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో... రమాదేవిని సత్కరించారు గవర్నర్‌ తమిళిసై. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటే అనుకున్నది సాధిస్తారన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం విద్యార్ధినులు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆమె సూచించారు. దిశా ఘటన తనను ఎంతగానో బాధించిందన్నారు ఆమె. కోఠి ఉమెన్స్ కాలేజీ ఆవరణలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీపీఎల్ డైరక్టర్ రమాదేవిని సత్కరించారు. అంతే కాక ఆమెపై, వనిత ఛానల్ పై ప్రశంసలు కురిపించారు. మహిళల కోసం మహిళలే నడుపుతున్న ఏకైక ఛానల్ వనిత టీవి అని ఆమె కొనియాడారు. 

ఇక ఆమె మాట్లాడుతూ ఎవరో ఏదో అన్నారని, కించపరిచారని కుంగిపోవద్దని విద్యార్థినులకు సూచించారు. గవర్నర్‌ తమిళి సై. తన కలర్, పొడవు, హెయిర్ స్టైల్‌పై గతంలో కించపరిచే వ్యాఖ్యలు చేసేవాళ్ళని కానీ ఇప్పుడు తాను అదే రూపంలో మీ ముందు గవర్నర్ గా నిలబడి ఉన్నానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని, లక్ష్యాల్ని సాధించే వరకు విమర్శలను పట్టించుకోవద్దని తమిళిసై విద్యార్థులకు సూచించారు. ఇక సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ నగరంలో మహిళా భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తుందని, అందులో భాగంగానే షి టీమ్స్‌, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలాంటి దారుణాలు జరగకుండా అనుక్షణం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇక ఆయన కూడా ఆర్టీపీఎల్ డైరెక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నడుస్తున్న వనిత టీవీ మహిళల కోసం ఎంతో చేస్తోందని ప్రశంసించారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల చివర్లో... వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ ఘనంగా సన్మానించారు.