సూపర్‌ఫుడ్‌గా పురుగుల పాలు

సూపర్‌ఫుడ్‌గా పురుగుల పాలు

తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇపుడు మనుషులు పురుగులపై పడ్డారు. రెండేళ్ళ క్రితం బొద్దింక పాలు మార్కెట్‌లో రాగా... ఇపుడు దక్షిణాఫ్రికాకు చెందిన గార్మెట్‌ గ్రబ్‌ ఏకంగా పురుగుల పాలును ప్రేవేశపెట్టింది. ఎంటో మిల్క్‌ పేరుతో దీన్ని అమ్ముతోంది. పర్యావరణ అనుకూలంగా ఉండటమే గాక న్యూట్రిషన్స్ అధికంగా ఉండే ఈ పాలలో లాక్టోస్‌ ఏమాత్రం ఉండదని కంపెనీ అంటోంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ పాలు డయాబెటిక్స్ ఉన్నవారు కూడా తాగొచ్చని తెలిపింది. ఇందులో గ్లూటిన్‌ ఉండదు. అత్యధిక ప్రొటీన్‌తో పాటు ఐరన్‌, జింక్‌, కాల్షియమ్‌ అధికంగా ఉంటుందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఎంటెమొఫాగీ ఆధారంగా నుంచి ఎంటిమిల్క్‌ పదం తీసుకున్నారు. ఎంటెమొఫాగీ అంటే పురుగులు తినడం. ఇంతకుమునుపు మార్కెట్‌లోకి వచ్చిన బొద్దింక పాలు కూడా ఎంతో శ్రేష్టమైనదని 2016లో భారత శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆవు పాలు కంటే మూడు రెట్లు అధిక శక్తిని బొద్దింక పాలు ఇస్తుందని వీరు తెలిపారు.