పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై జీతం..!

 పంచాయతీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై జీతం..!

కరోనా విజృంభణ కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అత్యవసర విధుల్లో ఉన్నవారు తప్ప మిగతా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు, మున్సిపల్, కార్మికులు, డాక్టర్లు లు మాత్రం కరోనా పై యుద్ధం చేస్తూ విధుల్లో ఉన్నారు. ఈ  నేసథ్యంలో పంచాయతీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి పంచాయతీ సిబ్బందికి నెలకు రూ.8,500 ఒకటవ తేదీనే అందిస్తామని ప్రకటించింది. దీనికోసం పంచాయతీలకు ప్రతి నెలా ఇచ్చే రూ. 336 కోట్ల నిధుల నుంచి సిబ్బంది వేతనాలు చెల్లించుకోవచ్చునని సూచించింది.అంతే కాకుండా ఈ నిబంధనలు పాటించని పంచాయతీలపై పంచాయతీరాజ్‌ చట్టం-2018 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.