ఏపీలో 15గంటల వ్యవధిలో ఒకే పాజిటివ్ కేసు!

ఏపీలో 15గంటల వ్యవధిలో ఒకే పాజిటివ్ కేసు!

ఏపీలో గడిచిన 15గంటల్లోఒకే కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నిన్నటి వరకు ఏపీలో జిల్లాల్లోనే 10చొప్పున కేసులు నమోదు కాగా తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ లో ఒకే కేసు నమోదు కావటం కొంచెం గుడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. దానికి సంబందించిన నివేదికను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. "రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో కొత్త గా గుంటూరు లో ఒక కేసు నమోదయింది. రాష్ట్రం లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసు ల సంఖ్య 304 కి పెరిగింది. కర్నూలు జిల్లాలో కొవిడ్-19 కారణంగా ఒక మరణం నిర్దారించబడింది" దాంతో ఏపీలో మర్కజ్ కాంటాక్ట్ కేసులను అదుపు చేయగలిగితే త్వరలోనే కోవిడ్ నుండి బయటపడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.<

/p>