వినియోగదారులకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

వినియోగదారులకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

దేశంలో బంగారం ధరలు ఇప్పటికే రూ. 50 వేలు దాటిపోయింది.  ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే.  కరోనా కాలంలోనూ ఈ స్థాయిలో ధరలు పెరగడం విశేషం.  అయితే, గత రెండు రోజులుగా ఈ ధరలు తగ్గుముఖం పట్టాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం  కారణం కావొచ్చు.  

ఇక ఇదిలా ఉంటె, హైదేరాబద్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి.  తగ్గిన ధరల ప్రకారం బంగారం రేట్లు ఇలా ఉన్నాయి.   10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 470 తగ్గి 46,270కి చేరింది.  ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.70 తగ్గి రూ. 50,880కి చేరింది.  ఇకపోతే వెండి ధర కూడా భారీగా తగ్గింది.  కిలో  వెండి ధర రూ.1500 తగ్గి రూ.48,550కి చేరింది.  ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.