మహిళలకు శుభవార్త: భారీగా పడిపోయిన బంగారం ధరలు 

మహిళలకు శుభవార్త: భారీగా పడిపోయిన బంగారం ధరలు 

మనదేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి.  కరోనా కారణంగా దేశంలో బంగారం అమ్మకాలు తగ్గాయి.  అయినప్పటికీ కొన్ని రోజుల క్రితం వరకు ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే.  అయితే, పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ధరలు ఇలా ఉన్నాయి. 

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 తగ్గి 46,100కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 తగ్గి రూ.50,710కి చేరింది.   బంగారం ధర తగ్గిపోయినా వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకాయి. కిలో వెండి ధర రూ.1090 పెరిగి రూ.49,600కి చేరింది.  నాణేల తయారీ నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధరలు పెరిగాయి.