గుడ్ న్యూస్: తగ్గిన పసిడి ధరలు... 

గుడ్ న్యూస్: తగ్గిన పసిడి ధరలు... 

పసిడి ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి.   లాక్ డౌన్ 5 సమయంలో ఇచ్చిన సడలింపులతో గోల్డ్ షాపులు తెరుచుకున్నాయి.  అప్పటి నుంచి దాదాపుగా ధరలు కొంతమేర పెరుగుతూ వస్తున్నది. రెండు రోజుల క్రితం రికార్డ్ స్థాయిలో ధరలు పెరిగి రూ.50 వేల మార్క్ దాటేసింది.  అయితే, ఈ ధరలు ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి.  

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.  190తగ్గి రూ. 46,100 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గి రూ.50,390కి చేరింది.  ఇక వెండి కూడా ఇదే బాటలో నడిచింది.  కిలో వెండి ధర రూ.  300 తగ్గి రూ.48,500కి చేరింది.