బంగారం ధరలకు రెక్కలు... అదే బాటలో వెండి కూడా... 

బంగారం ధరలకు రెక్కలు... అదే బాటలో వెండి కూడా... 

గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడమే ఇందుకు కారణం.  ఇటు దేశీయంగా కూడా బంగారం వినియోగం తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.  అయితే, రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు పెరిగాయి.  అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు పెరగడం విశేషం.  

ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 60 పెరిగి రూ.46,960కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరిగి రూ. 51,240కి చేరింది.  ఇక ఇదే బాటలో వెండి కూడా పయనించింది.  కిలో వెండి ధర రూ. 210 పెరిగి 52,210కి చేరింది.