బాసర గోదావరికి జలకళ 

బాసర గోదావరికి జలకళ 

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది నూతన జలకళ సంతరించుకోనుంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా బాబ్లీ ప్రాజేక్ట్ గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయనుంది. దీంతో బాసర గోదావరికి 20 క్యూసెక్కుల వరద  నీరు చేరనుంది. ఈ సందర్భంగా స్నానఘాట్ లను పరిశీలించి.. నాటు పడవలు నడిపే వారిని, భక్తులను అప్రమత్తంగా ఉండాలని బాసర మండల తహసిల్దార్ వేంకటరమణ, ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్ రెడ్డి సూచించారు. 

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు.. బాబ్లీ ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. బాబ్లీ ప్రొజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుండటంతో.. 4 గేట్లు ఎత్తి దిగువకు 98వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదికి వదిలారు. బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతూ శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు పరుగులు పెడుతున్నాయి. 24 గంటల్లో ఎస్.ఆర్.ఎస్.పి.లోకి వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. మరో వైపు ఎగువన కురిసిన వర్షాలకు కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ కు చాలా రోజుల తర్వాత జలకల వచ్చింది.