స్వదేశానికి వచ్చిన పారికర్

స్వదేశానికి వచ్చిన పారికర్

కాలేయ సంబంధ వ్యాధికి మూడు నెలలు అమెరికాలో చికిత్స పొందిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్వదేశానికి తిరిగి వచ్చారు. గత ఫిబ్రవరిలో ఆయన మూడు సార్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ సారి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో మరోసారి గోవా మెడికల్ కాలేజీలో ఆయనకు చికిత్స చేశారు. మార్చిలో మరోసారి తీవ్రంగా అస్వస్థతకు లోనవడంతో పారికర్ ను న్యూయార్క్ లోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందించారు.