నదిలో విహారానికి వెళ్లిన నటి... ఐదు రోజుల తరువాత ఇలా శవమై తేలింది...!!!

నదిలో విహారానికి వెళ్లిన నటి... ఐదు రోజుల తరువాత ఇలా శవమై తేలింది...!!!

సినిమా ఇండస్ట్రీలో రోజుకో విషాదం చోటు చేసుకుంటోంది.  తాజాగా హాలీవుడ్ నటి నయా రివీరా క్యాలిఫోర్నియాలోని పెరూ లేక్ లో పడి మృతి చెందింది.  ఐదు రోజుల క్రితం  నటి నయా రివీరా తన కుమారుడితో కలిసి బోట్ ను అద్దెకు తీసుకొని పెరూ లేక్ లో బోటింగ్ కు వెళ్ళింది.   అలా వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో, బోట్ అద్దెకు ఇచ్చిన వ్యక్తి పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశాడు.  దీంతో పోలీసులు పెరూ లేక్ లో గాలించగా, బోట్ దొరికింది.  అందులో ఆమె కుమారుడు మాత్రమే ఉన్నాడు.  నటి నయా రివీరా లేకపోవడంతో అనుమానం వచ్చిన  పోలీసులు, నదిని జల్లెడ పట్టారు.  ఐదు రోజుల తరువాత రివీరా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రివీరా ఆత్మహత్య చేసుకుందా లేదంటే ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఫాక్స్ మ్యూజికల్ సినిమా గ్లీ లో నటించిన ఈ నటి మంచి పేరు తెచ్చుకుంది.  రివీరా మరణం పట్ల హాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.