టాప్‌గేర్‌లో జీడీపీ వృద్ధిరేటు

టాప్‌గేర్‌లో జీడీపీ వృద్ధిరేటు

ప్రపంచంలోనే అత్యధిక వృద్ధిరేటు సాధించిన దేశంగా మనదేశం రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అంటే మూడు నెలల కాలంలో స్థూల జాతీయ వృద్ధిరేటు (జీడీపీ) 7.7 శాతంగా నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే కాలంలో చైనా సాధించిన వృద్ధి రేటు 6.8 శాతం. 2017-18 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతమని తెలిపింది.  గత ఏడాది అక్టోబర్‌ - డిసెంబర్‌ కాలానికి వృద్ధిరేటును ప్రభుత్వం 7.2 శాతం నుంచి 7 శాతంగా సవరించింది.