కోహ్లీ 183 ఇన్నింగ్స్ పై గంభీర్... 

కోహ్లీ 183 ఇన్నింగ్స్ పై గంభీర్... 

2012 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ పై విరాట్ కోహ్లీ చేసిన 183 ఇన్నింగ్స్ పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. మార్చి 18, 2012 న జరిగిన టోర్నమెంట్‌లో పాక్ పై కోహ్లీ 148 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్ తో 183 పరుగులు చేశాడు. దాంతో భారత్ 330 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆ ఆటలో గంభీర్ డక్ ఔట్ కావడంతో కోహ్లీ మొదటి ఓవర్లోనే బ్యాటింగ్‌కి రావలసి వచ్చింది. సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లీ 2 వ వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యాన్ని, 3 వ వికెట్‌కు రోహిత్ శర్మతో కలిసి 172 పరుగులు జతచేసి భారత్‌ను విజయం వైపుగా నడిపించాడు.  ఇక ఈ మ్యాచ్ లో రోహిత్, టెండూల్కర్ వరుసగా 68 మరియు 52 పరుగులు చేసి కోహ్లీకి సహకారం అందించారు. ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన గౌతమ్ గంభీర్... పాకిస్తాన్ తో జరిగిన 2012 ఆసియా కప్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ప్రశంసించారు. అతను ఇప్పటివరకు ఆడిన అన్ని ఇన్నింగ్స్ ల కంటే ఇదే గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పాడు. కోహ్లీ 183 పరుగులు అది కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా, ఆ సమయంలో అతనికి అంతగా అనుభవం కూడా లేదు. కాబట్టి నా ప్రకారం, విరాట్ కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి "అని గంభీర్ అన్నాడు.