విశాఖలో మరో గ్యాస్ లీక్..ఇద్దరు మృతి

విశాఖలో మరో గ్యాస్ లీక్..ఇద్దరు మృతి

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువ ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖలో మరో గ్యాస్ లీక్ కలకాలం రేపుతోంది. పరవాడ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ఫార్మా కంపెనీ నుండి విష వాయువులు లీకయినట్టు సమాచారం. సాయినార్ కెమికల్స్ రియాక్టర్ నుండి గ్యాస్ లీకై ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర అస్వస్థత చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. అర్ధరాత్రి దాటాక ఈ గ్యాస్ లీకయినట్టు గుర్తించారు. ఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్, అలానే పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా పరిశీలించారు. బెంజీన్ ఎడిజోల్ అనే ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఏర్పడిన రియాక్షన్ వలనే ఈ గ్యాస్ లీక్ అయిందని అంటున్నారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కేవలం కంపెనీ వరకే పరిమితం అయింది, బయట దాకా ఇది లేకయ్యే ప్రమాదం లేదని అంటున్నారు. ఎవరైతే ఆ రియాక్టర్ వద్ద పని చేస్తున్నారో ఆ ఆరుగురి మీదనే ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.