బాబు ఎందుకు క్షమాపణ చెప్పాలి...

బాబు ఎందుకు క్షమాపణ చెప్పాలి...

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై నిన్న తిరుపతిలో జరిగిన రాళ్లదాడి సంఘటనపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. గంటా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. అమిత్‌ షా కాన్వాయ్‌పై తిరుపతిలో జరిగిన సంఘటన దురదృష్టకరం అని అన్నారు. నిన్ననే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి.. వెంటనే ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు అని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీకి హోదా ఇవ్వక పోవడంతో ప్రజలలో‌ బీజేపీపై తీవ్రంగా ఉక్రోషం ఉంది, ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగింది అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమిత్‌ షాకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హోదా హామీని అమలు చేయనందుకు ఆంధ్రులకు మోడి, అమిత్ షా క్షమాపణ చెప్పాలి అని అన్నారు. కర్నాటక ఎన్నికల అనంతరం చిక్కులు తప్పవంటూ బెదిరింపులకు రాష్ట్రంలోని బీజేపీ నాయకులు దిగుతున్నారు అని  విమర్శించారు.