నాకు అన్యాయం చేసారు అంటున్న గంగూలీ... 

నాకు అన్యాయం చేసారు అంటున్న గంగూలీ... 

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ తాను క్రికెట్ ఆడే సమయంలో అందులో ఉండే వ్యక్తులు తనకు అన్యాయం చేసారు అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 2003 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు‌ గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్ కు వచ్చి ఓడిపోయింది. అందువల్ల 2007లో జరిగే ప్రపంచకప్‌‌ని గెలవాలని అనుకున్నట్లు దాదా తెలిపాడు. కానీ ఊహించని విధంగా నన్ను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించారు అని ఆ తర్వాత టెస్టు జట్టులోకి కూడా రానివ్వలేదని గంగూలీ అన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. జింబాబ్వే పర్యటనలో విజయం సాధించి వచ్చిన తర్వాత నన్ను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించారు. ఆ తర్వాత టెస్ట్ జట్టులోకి కూడా ఎంపిక చేయలేదు. అప్పటి భారత జట్టు కోచ్ గ్రేగ్ ఛాపెల్ కారణంగానే ఇలా జరిగింది. కానీ బీసీసీఐ లోని కొందరు అతనికి మద్దతు పలికి నాకు అన్యాయం చేసారని తెలిపాడు. కానీ ఏడాది గ్యాప్ తర్వాత మళ్ళీ తన ఆటతో టెస్ట్ జట్టులోకి వచ్చాడు దాదా. అయితే అప్పుడు తనకు ఎక్కడ అన్యాయం జరిగిందో ఇప్పుడు అక్కడే అత్యున్నత స్థాయిలో ఉన్నాడు గంగూలీ.