గజ్వేల్‌లో గెలిచి కానుకగా ఇస్తా...!

గజ్వేల్‌లో గెలిచి కానుకగా ఇస్తా...!

2019 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి బహుమతిగా ఇస్తానన్నారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి... ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఒంటేరు... ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గజ్వేల్ నుంచే గతంలోలాగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మళ్లీ పోటీచేయాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. గజ్వేల్ ప్రజలు ఎంతో అభిమానంతో, విశ్వాసంతో నన్ను గెలిపిస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చిన ఒంటేరు... గతంలో లాగా ప్రలోభపెడితే వెళ్లిపోయే నేతలు మా వైపులేరని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, జాతీయ భావాలు, నాయకత్వం పట్ల విశ్వాసం, నమ్మకంతోనే పార్టీలో చేరానని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి... 2014 ఎన్నికల్లో తనపై అతి తక్కువ మెజార్టీతో సీఎం కేసీఆర్ గెలుపొందిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో.... టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్‌ను ఓడిస్తామని ప్రకటించారు. ఇక రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినందకు తనపై కేసులు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు ఒంటేరు.