తోటి స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం !!

తోటి స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం !!

స్నేహితురాలు అనికూడా చూడకుండా అత్యాచారం చేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన ఓ యువతి  ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కాలేజీ లో చదువుతున్న ఓ  యువకుడితో పరిచయం అయింది. ఈ క్రమంలో ఆ యువకుడు మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి ఆమెను అత్యాచారం చేసి  నగ్నదృశ్యాలు, వీడియో చిత్రీకరించాడు.ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆమె అతనికి దూరమైంది. తర్వాత ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండసాగింది. ఆ యువకుడి వద్దకూ స్నేహితుల ద్వారా ఆమె  వీడియోలు చేరాయి.వాటిని అతడు  సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు . ఆ తర్వాత తొలగించాడు. 
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు పరువుపోతుందనే భయంతో ఇద్దరు యువకులను సంప్రదించి తమ కుమార్తె వ్యవహారాన్ని వదిలివేయాలని వేడుకున్నారు. వారి వద్దనున్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ యువతి నగ్నచిత్రాలుమరోసారి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.దాంతో ఆ యువతీ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు .