ఎల్లుండి నుంచి ఏసీ, ఫ్రిడ్జిల ధరలు పెంపు

ఎల్లుండి నుంచి ఏసీ, ఫ్రిడ్జిల ధరలు పెంపు

డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం, ముడి చమురు ధరలు పెరగడంతో పాటు స్టీల్‌, కాపర్‌ ధరలు పెరగడంతో ఎల్లుండి నుంచి ఎయిర్‌ కండీషనర్లతో పాటు  రెఫ్రెజిరేటర్ల ధరలు పెరగనున్నాయి. పెరుగుదల 2 శాతం నుంచి 5 శాతం వరకు ఉండే అవకాశముంది.  మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ వంటి ధరలు కూడా  పెరగనుంది. వస్తువును బట్టి ధరలు రూ. 400 నుంచి రూ. 1500 వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వస్తువులకు ఇటీవల పెద్దగా డిమాండ్‌ లేదని, అయినా ముడి వ్యయం భారీగా పెరగడంతో ధరలు పెంచకతప్పడం లేదని వీరు అంటున్నారు. పాత స్టాక్‌ను పాత ధరలకే అమ్ముతున్నామని.. జూన్‌ 1 నుంచి వచ్చే కొత్త స్టాక్‌ ధరలు పెరుగుతాయి. గోద్రేజ్‌ తన ఉత్పత్తుల ధరలను రెండు నుంచి మూడు శాతం పెంచనుంది. ఇక టాటా గ్రూప్‌ కంపెనీ ఓల్టాస్‌ ఇప్పటికే తన ఏసీ రేట్లను మూడు శాతం దాకా పెంచింది. తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచుతున్నట్లు వర్ల్‌పూల్‌ వెల్లడించింది. ఎల్‌జీ, శామ్‌సంగ్‌ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను అయిదు శాతం దాకా పెంచనున్నారు. ఇటీవల కాలంలో డాలర్‌తో రూపాయి విలువ ఏకంగా ఏడు శాతం క్షీణించింది. ఇదే సమయంలో ముడి చమురు ధరలు పెరగడంతో అధిక మొత్తం వెచ్చించాల్సి వచ్చిందని కంపెనీలు అంటున్నాయి.