న‌వంబ‌ర్ వ‌ర‌కు ఫ్రీ రేష‌న్...

న‌వంబ‌ర్ వ‌ర‌కు ఫ్రీ రేష‌న్...

క‌రోనా క‌ష్టాల‌తో ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిన్న స‌మ‌యంలో పేద ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ చెప్పారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని మోడీ.. నవంబర్ వరకు పేదలకు ఫ్రీ రేషన్ కొనసాగుతుందని ప్రకటించారు. వన్ రేషన్ వన్ నేషన్ తో పేదలకు, వలస కార్మికులకు లబ్ది చేకూరుతుంద‌న్న ఆయ‌న‌..  దేశంలో పేదలు ఎక్కడి నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చు అని వెల్ల‌డించారు.. కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి 5 కిలోల‌ గోధుమలు లేదా 5 కిలోల బియ్యం, కిలో కందిప‌ప్పు ఇస్తామని తెలిపారు. ఉచిత రేష‌న్ కోసం రూ.90 కోట్లు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ.. గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద నవంబరు నెల వరకు పేదలకు ప్రతీ నెల ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. 

ఇక‌, ఇప్పుడు ఆహారధాన్యాలు ఇస్తున్నాం అంటే ఆ ఘనత ఇద్దరికే దక్కుతుంది.. ఒకరు రైతు, రెండు పన్ను చెల్లింపుదారే అన్నారు ప్ర‌ధాని మోడీ.... వారి నిజాయితీ, శ్రమ తోనే ఇప్పుడు ప్ర‌తీ పేదవాడికీ మనం ఆహారం అందించగలుగుతున్నామ‌న్న ఆయ‌న‌.. జూలై మాసం నుంచి మెల్లిగా పండుగల కాలం వస్తుంది... ఆ సమయంలో అవసరాలు, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇవి దృష్టిలో పెట్టుకుని.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను న‌వంబ‌ర్ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు భార‌త ప్ర‌ధాని.