రష్యా కావాలన్న ట్రంప్‌.. కౌంటరిచ్చిన ఫ్రాన్స్‌

రష్యా కావాలన్న ట్రంప్‌.. కౌంటరిచ్చిన ఫ్రాన్స్‌

పారిశ్రామిక దేశాలైన జీ7 బృందంలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనకు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కౌంటర్‌ ఇచ్చారు. 'కావాలంటే జీ7 నుంచి మీరు వెళ్లిపోండి.. జీ6 చాలు' అని పేర్కొన్నారు. భారీగా టారిఫ్‌లు విధించినందుకు, ఇరాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా ఇతర దేశాలను అడ్డుకుంటున్నందుకు ట్రంప్‌పై ఎప్పటి నుంచో మాక్రాన్‌ గుర్రుగా ఉన్నారు. క్రిమియాను ఆక్రమించుకోవడంతో 2014లో రష్యా జీ7 నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీ7 సభ్యదేశాల సంఖ్య తగ్గిపోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ బృందంలో రష్యా కూడా ఉండేదని, ఆ దేశం లేకుండా సమావేశం సరికాదని అన్నారు. 'జీ8' నుంచి పంపించేసిన రష్యాను వెనక్కి రానివ్వాలి అని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్రంప్‌కు ఇటలీ ప్రధాని గ్యుసెపె మద్దతు తెలపగా.. ఫ్రాన్స్‌, కెనడా, బ్రిటన్ దీనిని వ్యతిరేకించాయి. ఇక..కెనడా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, జర్మనీలున్న జీ7 సదస్సు కెనడాలోని క్యుబెక్‌లో ఉన్న లా మెల్‌బాయ్‌లో జరగనున్నది.