మాజీ భారత ఆటగాడికి కరోనా పాజిటివ్.. 

మాజీ భారత ఆటగాడికి కరోనా పాజిటివ్.. 

భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ రోజు ఫలితాల్లో పాజిటివ్ గా తేలింది. దాంతో చౌహాన్ కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయబోతున్నారు, వారిని ప్రస్తుతానికి తమ ఇంట్లోనే నిర్బంధంలో ఉంచారు. చౌహాన్ లక్నోలోని సంజయ్ గాంధీ పిజిఐ ఆసుపత్రిలో చేరారు. చౌహాన్ గురించి వార్తలు వచ్చిన వెంటనే భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. చేతన్ చౌహాన్ భారతదేశం తరఫున 40 టెస్టులు మరియు 7 వన్డేలు ఆడాడు, రెడ్ బాల్ క్రికెట్‌లో 31.57 సగటుతో 2084 పరుగులు , 50 ఓవర్ల ఫార్మాట్‌లో 21.85 వద్ద 153 పరుగులు చేశాడు. అలాగే ఆయన మహారాష్ట్ర మరియు ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ లో ఆడాడు. అయితే ఈయన 1981 లో అర్జున అవార్డుతో సత్కరించబడ్డాడు.