షాపై దాడి అనుమానాలను రేకెత్తిస్తోంది..

షాపై దాడి అనుమానాలను రేకెత్తిస్తోంది..

తిరుపతిలో అమిత్ షా పై జరిగిన దాడి అమానుషమైందని మాజీ డిజిపి దినేష్ రెడ్డి తెలిపారు. ఆమిత్ షాపై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరపించాలని గవర్నర్ నరసింహన్ ను కోరామన్నారు. ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తిరుపతిలో అమిత్ షాపై దాడి ప్రభుత్వమే చేయించినట్లు అనిపిస్తుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ హోంమంత్రి ప్రకటన చూస్తుంటే.. మరిన్ని అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. 

ఏపీలో సమర్ధత గల పోలీసులు ఉన్నప్పటికీ.. రాజకీయ జోక్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. అమిత్ షాపై దాడి జరిగిన ఘటనలో విచారణ పారదర్శకంగా రాకపోతే.... రాష్ట్రపతిని కలిసి పిర్యాదు చేస్తాం... అవసరమైతే ఎన్ఐఏతో విచారణ జరిపిస్తామని దినేశ్ రెడ్డి వెల్లడించారు.