మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్...!

 మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్...!

మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అశోక్ చవాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు సోకాయన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా... ఆ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయనకు స్వగ్రామంలోనే వైద్యం అందిస్తున్నారు. తరుచుగా ఆయన ముంబై నుంచి ఆయన స్వగ్రామానికి ప్రయాణిస్తూ ఉంటారు. 

ఉద్ధవ్ కేబినెట్‌లోనే మరో మంత్రి, ఎన్సీపీ నేత జితేంద్ర అహ్వాద్‌కు కూడా పాజిటివ్ తో బాధపడ్డారు. ఆయనకు ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో రెండు వారాలకు పైనే చికిత్స కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాటింది. అలాగే మొత్తం కరోనా మరణాల్లో 1,635 మంది మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. ముంబయి నగరంలోనే 30వేల మందికిపైగా వైరస్ నిర్ధారణ అయ్యింది.