జూన్ 8న చేప ప్రసాద పంపిణీ...

జూన్ 8న చేప ప్రసాద పంపిణీ...

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌‌ గౌడ్ తెలిపారు. జూన్ 8, 9 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూన్‌ 8న ఉదయం 9.30 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వ సాయంతో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మత్స్యశాఖ 2 లక్షల చేప పిల్లలను సిద్ధం చేసిందన్నారు. మొత్తం 32 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు.

Photo: FileShot