టాటా గ్రూప్‌ చరిత్రలో తొలిసారిగా...

టాటా గ్రూప్‌ చరిత్రలో తొలిసారిగా...


టాటా గ్రూప్‌లో ఊహించని నిర్ణయం. 150 ఏళ్ళ  వంద బిలియన్‌ డాలర్ల టాటా గ్రూప్‌ తొలిసారిగా తన ఉద్యోగులకు ఎసాప్‌ (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌) ఇవ్వాలని నిర్ణయించింది. దీన్ని టాటా మోటార్స్‌ కంపెనీలో అమలు చేయనున్నారు. టాప్‌ లెవల్లోఉన్న 200 మంది ఉన్నత ఉద్యోగులతో ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలోనే జరగనున్న కంపెనీ ఏజీఏంలో వాటాదారుల అనుమతి తీసుకోనుంది కంపెనీ. జెస్ట్‌, హెక్సా, నెక్సాన్‌ వంటి కొత్త మోడల్స్‌తో దూసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్న టాటా మోటార్స్‌.. అనుకున్న టార్గెట్‌ను సాధించలేకపోతోంది. జాగ్వార్‌ రోవర్‌ నుంచి లాభాల వాటా తగ్గుతుండటంతో కంపెనీ టాటా మోటర్స్‌ దేశీయ మార్కెట్‌పై దృష్టి పెట్టింది.