రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో విడుదల..?

రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో విడుదల..?
చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఏ సినిమాకైనా విడుదలకు ముందు ఒకటే భయం ఉంటుంది.  ఎక్కడ సినిమా పైరసీ ఎఫెక్ట్ పడుతుందో అని.  కొన్ని సినిమాలు విడుదల తరువాత పైరసీ ఎఫక్ట్ తో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తే... మరికొన్ని విడుదలకు ముందే సోషల్ మీడియాలో రిలీజ్ అవుతుంటాయి.  అయితే, ఓ నటుడు మాత్రం తన సినిమాను విడుదలకు ముందుగానే సోషల్ మీడియాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.  
తెలుగులో బిచ్చగాడుగా వచ్చిన తమిళ హీరో విజయ్ ఆంటోనికి తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.  భేతాళుడు సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. భేతాళుడు తరువాత ఇప్పుడు కాశీ గా వస్తున్నాడు విజయ్ ఆంటోని.  ఈనెల 18 న విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో దీని గురించి కొన్ని ఆసక్తికరమైన కథనాలు బయటకు వచ్చాయి.  
 
కాశీ ప్రమోషన్లో భాగంగా సినిమాలోని మొదటి 7 నిమిషాలు చిత్రాన్ని యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్ ద్వారా విడుదల చేయనున్నారట.  మే 15 వ తేదీ సాయంత్రం 6 గంటలకు సోషల్ మీడియాలో 7 నిమిషాల చిత్రం విడుదలౌతుంది.  కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో విజయ్ ఆంటోని నిర్మించాడు.