ఫైనల్ గా ధావన్ గుండు పైన...

ఫైనల్ గా ధావన్ గుండు పైన...

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో సమయాన్ని బాగా గడుపుతున్నాడు. అయితే  ఈ ఆటగాడు గ్రౌండ్ లో మీసం తిప్పి, తొడ కొట్టడం అభిమానులను అలరిస్తుంది. కానీ ధావన్ తలపైన మాత్రం ఎప్పుడు జుట్టు ఉండదు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో అందరూ ఆటగాళ్లు తమ కొత్త లుక్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ధావన్ కూడా  అదే పని చేసాడు. తన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో  షేర్ చేసాడు. అందులో... ఈ ఇండియన్ ఓపెనర్ ఫన్నీ రంగురంగుల విగ్ ను ధరించిన ఫోటోను పోస్ట్ చేసాడు. దానికి శిఖర్ 'చివరికి నాకు జుట్టు వచ్చింది' అని క్యాప్షన్ చేశాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆగిపోయింది. ఇక వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యొక్క 13 వ సీజన్ లో ధావన్ ఢిల్లీ తరపున ఆడనున్నాడు.