నటులకు కలిసిరాని కర్ణాటకం

నటులకు కలిసిరాని కర్ణాటకం

కర్ణాటక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి.  ఎన్నికలన్న తరువాత రాజకీయ నాయకులతో పాటు సినిమా నటులు నిర్మాతలు, ఆశావాహులు అంతా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. కర్ణాటక ఎన్నికల్లో నటులు జగ్గేష్, సాయి కుమార్, కుమార్ బంగారప్ప, నిర్మాత యోగేశ్వర్, నటి ఉమాశ్రీ, శశికుమార్, బిసి పాటిల్, నెహ్రు నరేంద్ర బాబు లు పోటీ చేశారు.  

యస్వంత్ పూర్ నుంచి నటుడు జగ్గేష్ బీజేపీ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యాడు.  విజయ్ లక్ష్మి చేతిలో జగ్గేష్ ఓడిపోయాడు.  బీజేపీ తరపున భాగేపల్లి నుంచి పోటీ చేసిన సాయి కుమార్ కూడా ఈ ఎన్నికల్లో పరాయజం పాలయ్యాడు.  కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన  సిద్దిరామ ఉమాశ్రీ బీజేపీ అభ్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.  ఇక మరో నటుడు శశికుమార్ జేడీఎస్ తరపున హోసదుర్గ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.  ఇక కన్నడ సినీ నిర్మాత సిఆర్ మనోహర్ కూడా ఈ ఎన్నికల్లో జేడీఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.  మరో నిర్మాత హెచ్.డి కుమారస్వామి జేడీఎస్ తరపున రామనగరం, చెన్నపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.