ఫైటర్ మొదలుపెట్టాడు... ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది... 

ఫైటర్ మొదలుపెట్టాడు... ఫ్యాన్స్ కల నెరవేరబోతోంది... 

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫైటర్ మొదలు పెట్టాడు.  ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభం అయ్యింది.  ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి అనన్య పాండేను తీసుకుంటున్నారు.  ఇక ఇదిలా ఉంటె, విజయ్ దేవరకొండను పాన్ ఇండియా హీరోగా చూడాలని చాలామంది కలలు కంటున్నారు.  ఆ కల ఇప్పుడు నెరవేరబోతోంది. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమాను తెలుగుతో పాటుగా, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు.  హిందీలో ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాణ సహాయం అందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా సినిమాను రిలీజ్ చేస్తారట.  ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం తరువాత పూరి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.  మరి ఇస్మార్ట్ లాగానే ఈ సినిమా కూడా భారీ విజయం సొంతం చేసుకుంటుందా చూద్దాం.