డిజిటల్‌ పేమెంట్స్‌లో గుత్తాధిపత్యమా?

డిజిటల్‌ పేమెంట్స్‌లో గుత్తాధిపత్యమా?

దేశంలో ఇపుడిపుడే పుంజుకుంటున్న డిజిటల్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పే టీఎం, ఫోన్‌ పే, అమెజాన్‌ పే, గూగుల్‌ తేజ్‌ వంటి కంపెనీలు డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లోకి ఉండగా, ఫేస్‌బుక్‌ త్వరలోనే రానుంది. దేశవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయంగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కేవలం కొన్ని కంపెనీలదే గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నాయని... దీనివల్ల ఈ రంగంలో రిస్క్‌ కూడా ఎక్కువగా ఉందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా అనేక కంపెనీలు ఈ రంగంలోకి రావాల్సి ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ఇవాళ విడుదల పరపతి విధాన సమీక్ష పత్రంలో స్టేట్‌మెంట్‌ ఆన్‌ డెవలప్‌మెంటల్‌ అండ్‌ రెగ్యులేటరీ పాలసీస్‌ అనే అంశంపై డిజిటల్‌ రంగం గురించి విస్తృతంగా ప్రస్తావించింది. నోట్ల రద్దు వల్ల పేటీఎం బాగా లబ్ది పొందింది.